Saturday, November 19, 2011

PDF Handbook of Technical Videos

ప్రతీ కంప్యూటర్ యూజర్ కీ ఖచ్చితంగా పనికొచ్చే పలు తెలుగు టెక్నికల్ వీడియోల హ్యాండ్ బుక్ ఇది. ప్రస్తుతానికి కొన్ని వీడియోల లింకులు ఇచ్చాం. ఈ ఫైల్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయబడుతూ ఉంటుంది. ఈ మెసేజ్ ని మీకు తెలిసిన వారికీ మెయిల్ ద్వారా, ఫేస్ బుక్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా పంపడం ద్వారా ఓ నాలెడ్జబుల్ సొసైటీని నిర్మించడంలో మీ బాధ్యతనూ నిర్వర్తించగలరు.
ఫైల్ అప్ డేట్ తేదీ: నవంబర్ 18, 2011.

1.      పలు సెల్ ఫోన్లని USB పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేసుకునే కేబుల్ దొరుకుతోంది తెలుసా? అదీ తక్కువ ధరకే! అదెలా ఉంటుందో ఎలా వాడాలో ఈ వీడియోలో చూడండి
http://goo.gl/Gwhzz

2.      పిసి యూజర్లు కంప్యూటర్ ని విప్పదీస్తే లోపల ఏమి పాడవుతాయో అని అస్సలు క్లీనింగే చేయరు. మీకు ఎలాంటి భయం లేకుండా ఈజీగా మీ పిసిని క్లీన్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించాము..
           http://goo.gl/ZdUpd
3.      విండోస్ మీడియా ప్లేయర్ లో పాటలు వినేటప్పుడు మీకు నచ్చిన ఫొటోని బ్యాక్ గ్రౌండ్ గా సెట్ చేసుకోవచ్చని తెలుసా? ఆ చిన్న టెక్నిక్ ని ఇక్కడ చూసేయండి మరి.
           http://goo.gl/IeAZS
4.      చాలామంది Gmail అకౌంట్లు హ్యాక్ అయి ఉంటున్నాయి.. అయినా ఆ విషయం తెలియకుండానే పనిచేసుకుపోతున్నారు. ఈ నేపధ్యంలో మీ అకౌంట్ హ్యాక్ అవకుండా ఎంత పటిష్టమైన జాగ్రత్త తీసుకోవచ్చో ఈ వీడియోలో చూడవచ్చ.
           http://goo.gl/h5WDj
5.      చీటికీ మాటికీ మీ పిసికి వైరస్ వస్తోందా? హార్డ్ వేర్ టెక్నీషియన్ కి వందలకొద్దీ వదిలిస్తున్నారా? ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవండి ఇక మీ పిసికి వైరస్సే రాదు.
http://goo.gl/9pGiD
6.      ఫొటోషాప్ లో మీ ఫొటోని మంచి బ్యాక్ గ్రౌండ్ లో నిలబడ్డట్లు మిక్సింగ్ చేయాలనుకుంటున్నారా? మీ ఫొటోనే కాదు.. మీ ఫ్రెండ్స్ బర్త్ డేల సమయంలో ఈ టెక్నిక్ తో వారికి మంచి గ్రీటింగూ చేసేయొచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి..

http://goo.gl/mOzOi

7.      BIOSలో మనం కంప్యూటర్ కి పాస్ వర్డ్ పెట్టుకోవచ్చు, USB పోర్టులను పనిచేయకుండా చేయొచ్చు... వందలాది సెట్టింగులు అందులో లభిస్తుంటాయి. మరి వాటిని ఈజీగా వాడడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.
http://goo.gl/YUXxu

8.      మీ కంప్యూటర్ ని మీ పెన్ డ్రైవ్ సాయంతో వేగంగా పనిచేసేలా చేసుకోవచ్చని తెలుసా? పెన్ డ్రైవ్ ని వృధాగా పక్కన పెట్టడం మానేసి ఈ టెక్నిక్ తెలుసుకుని ఆచరించండి మరి.. పిసి అన్నా స్పీడ్ అవుతుంది..
          http://goo.gl/5SgZH
9.      కొన్ని వైరస్ లు విండోస్ లో ఎంత ట్రై చేసినా దాక్కునే ఉంటాయి. అలాంటప్పుడు విండోస్ బూట్ అవకముందు వాటిని స్కాన్ చేసుకోవడం బెటర్. అదెలాగో ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది.
http://goo.gl/0usHF
10.   మెయిల్స్ లోనూ, ఛాటింగ్ లోనూ, Word, Notepad వంటి అనేక విండోస్ ప్రోగ్రాముల్లోనూ చక్కగా తెలుగులో టైప్ చేయాలని ఉంటే.. అది ఎంత చిన్న విషయమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
         http://goo.gl/JpEIE
11.   మీ ఫోన్ కోసం కొన్న బ్లూటూత్ హెడ్ సెట్ కేవలం ఫోన్ కాల్స్ నే విన్పిస్తోందా? పాటలూ, సినిమాల్లోని ఆడియోనీ బ్లూటూత్ హెడ్ సెట్ లో పొందడం ఎలాగో ఈ క్రింది లింకులో చూడండి
http://goo.gl/EUmyZ

12.   కొత్తగా ఫొటోషాప్ నేర్చుకుంటున్నారా? లేదా ఇప్పటికే కొంత వచ్చా? ఈ వీడియోలో చూపిస్తున్న రెండు మంచి టెక్నిక్ లు ఇకపై మీకు మరింత యూజ్ ఫుల్ గా ఉంటాయి మీరే చూడండి

http://goo.gl/Uhxm6
13.   కొన్ని ఫైల్ పేర్లు బ్లూ కలర్ లో కన్పిస్తుంటాయి. ఇలా కన్పిస్తోందంటే వైరస్సా? ఏమైనా సిస్టమ్ లో ప్రాబ్లెం ఉందా? అస్సలు ఎందుకు ఇలా కన్పిస్తాయో ఇక్కడ తెలుసుకోండి
     http://goo.gl/x4cav
14.   మీ ఇంట్లో పిల్లలు గంటల తరబడి ఛాటింగ్, మెయిల్స్, ఫేస్ బుక్ వంటి వాటికి అతుక్కుపోతున్నారా? లేదా మీరు ఏవైనా ఇతర వెబ్ సైట్లని బ్లాక్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే చాలా చిన్న టెక్నిక్ తో అవసరం లేని సైట్లని బ్లాక్ చేసుకోవడం ఇక్కడ చూడండి
http://goo.gl/rfkuw

15.   సెల్ ఫోన్ లోనూ తెలుగు చూడొచ్చు, తెలుగులో టైప్ చేసుకోవచ్చని తెలుసా? ఆశ్చర్యపోకండి.. స్వయంగా మీరే ఈ వీడియోలో చూడండి.. మీరూ మరో 10 మందికి చెప్తారు..
http://goo.gl/al1MK

16.   మీ టివికి ఉన్న డివిడి ప్లేయర్ లో అన్ని వీడియోలూ ప్లే అవడం లేదా? మీ పిసిలో ప్లే అయ్యే అన్ని వీడియోలూ టివిలోనూ ప్లే అయ్యే విధంగా మార్చుకోవడం ఎలాగో ఇక్కడ చూసేయండి, ఇక మీ ప్రాబ్లెం సాల్వ్ అవుతుంది.
        http://goo.gl/LUAjD
17.   సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించుకోవడానికి కష్టపడి షాపుల చుట్టూ తిరగడం ఎందుకు? ఇక్కడ అద్భుతమైన పద్ధతిని చూపించాం.. ఇకపై దీన్ని ఫాలో అయిపొండి.. రీఛార్జ్ ఎప్పుడైనా మీరే చేసుకోవచ్చు..
http://goo.gl/WafcM

Note: This is a forward material from Nallamothu Sridhar, a Technical writer. Refer his website: http://www.computerera.co.in for further details.